: ఉభయసభలు ప్రారంభం... తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేశారంటూ కాంగ్రెస్ ఎంపీల ఆందోళన
పార్లమెంటు ఉభయ సభలు కాసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. వెంటనే, రాజ్యసభలో తెలుగు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ ఎంపీలు ఆందోళనకు దిగారు. బడ్జెట్లో రెండు తెలుగు రాష్ట్రాలకు తీరని అన్యాయం చేశారంటూ ఛైర్మన్ పోడియంను చుట్టుముట్టి, నినాదాలు చేస్తున్నారు. పోడియంను చుట్టుముట్టిన వారిలో జేడీ శీలం, వీహెచ్, ఖాన్, సుబ్బరామిరెడ్డి తదితరులు ఉన్నారు. దీనికితోడు, ఈ రోజు రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు మార్పు, చేర్పులపై చర్చ జరిగే అవకాశం ఉంది. మరోవైపు, నల్లధనం అంశంపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటు వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.