: ఉత్తర భారతంలో మంచు వర్షం ... రవాణాకు తీవ్ర అంతరాయం


మంచు, భారీ వర్షాలతో ఉత్తర భారతదేశం ఇబ్బందిపడుతోంది. ప్రధానంగా జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను మంచు కప్పివేయగా, వర్షం అతలాకుతలం చేసింది. కొన్నిచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఢిల్లీ, హర్యానా, ఛండీగఢ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ లలో పలు ప్రాంతాల్లో వడగండ్లతో కూడిన వర్షం పడింది. దేశ రాజధాని ఢిల్లీ జలమయమైంది. దాంతో, పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. జమ్మూకాశ్మీర్ లో అధికంగా మంచుపడుతోంది. పలుచోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ కారణంగా జాతీయ రహదారిని మూసివేసినట్టు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే, అకాల వర్షాలతో ఉత్తరభారతంలో పంటలు కూడా బాగా దెబ్బతిన్నాయి. గుజరాత్ లో గోధుమ, పత్తి, ఉల్లి, వేరుశనగ పంటలకు ప్రతికూల పరిస్థితి ఏర్పడింది.

  • Loading...

More Telugu News