: రూ. 46 వేల ధర పలికిన కోడిగుడ్డు


అవును, ఇది నిజమే. ఈ కోడిగుడ్డు రూ. 46 వేలు ధర పలికింది. ఇంతకీ గుడ్డు స్పెషాలిటీ ఏంటని అడుగుతారా? ఏముంది... గుడ్డు గుండ్రంగా ఉంది అంతే. సాధారణంగా కోడిగుడ్లు దీర్ఘ వృత్తాకారంలో వుంటాయి. కానీ, బ్రిటన్లో 'పింగ్ పాంగ్' అనే పేరున్న ఆర్పింగ్ టన్ జాతికి చెందిన కోడిపెట్ట ఒకటి ఆశ్చర్యం కలిగిస్తూ గుండ్రంగా ఉన్న గుడ్డు పెట్టింది. దీన్ని వేలానికి ఉంచగా మొత్తం 64 బిడ్లు దాఖలయ్యాయి. 100 కోట్ల గుడ్లలో ఒకటి ఇలా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. అందుకే దీనికి ఇంత డిమాండ్ రాగా, వేలంలో 480 పౌండ్ల (సుమారు రూ. 46 వేలు) ధర పలికింది. కోడి యజమాని గుండ్రంగా ఉన్న గుడ్డును ఫేస్ బుక్ లో పెట్టగా, ఓ మిత్రుడు దాన్ని వేలం వేస్తే ఎంతో డబ్బు వస్తుందని చెప్పాడట. మరి నిజమేగా!

  • Loading...

More Telugu News