: జలయజ్ఞాన్ని కాంగ్రెస్ ధనయజ్ఞంలా మార్చింది: బాలయ్య ధ్వజం
టాలీవుడ్ ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నేటి ఉదయం అచ్చమైన రాజకీయ నేతలా ఊగిపోయారు. రాయలసీమ జిల్లాల్లో కొనసాగుతున్న హంద్రీ-నీవా ప్రాజెక్టు పనులను ఏపీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో కలిసి ఆయన పరిశీలించారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆయన, గత కాంగ్రెస్ పాలనపై విరుచుకుపడ్డారు. జలయజ్ఞం పేరిట ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ ప్రభుత్వం దానిని ధనయజ్ఞంలా మార్చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ నేతల జేబులు నింపేందుకు కాంగ్రెస్ సర్కారు జలయజ్ఞాన్ని చేపట్టిందని ఆయన ధ్వజమెత్తారు.