: పవన్ కల్యాణ్ తుళ్లూరు పర్యటన రద్దు... ఈ నెల 5కు వాయిదా
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని తుళ్లూరులో జరపనున్న పర్యటన రద్దైంది. ఈ నెల 5న అక్కడ పర్యటించాలని ఆయన నిర్ణయించుకున్నారు. నవ్యాంధ్ర రాజధాని కోసం భూములను సమీకరిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం, తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా బలవంతంగా భూములను లాక్కుంటోందని తుళ్లూరు పరిసర గ్రామాల రైతులు జనసేన బేనర్లను చేతబట్టి నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలో నిన్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడిని కలిసిన పవన్ కల్యాణ్, ఈ విషయంపై చర్చించారు. ఆ తర్వాత తుళ్లూరులో పర్యటించాలని నిర్ణయించుకున్న ఆయన, మరికొద్దిసేపట్లో అక్కడికి బయలుదేరాల్సి ఉండగా పర్యటనను రద్దు చేసుకోవడం విశేషం.