: సినిమాగా మార్షల్ ఆర్ట్స్ వీరుడు బ్రూస్ లీ జీవిత చరిత్ర
మార్షల్ ఆర్ట్స్ వీరుడు, హాలీవుడ్ సినిమాకు యాక్షన్ హంగులద్ది చైనీయులకు గుర్తింపు తెచ్చిన నటుడు బ్రూస్ లీ జీవిత చరిత్రను సినిమాగా రూపొందించనున్నారు. ఎంతో మంది అభిమానులకు స్ఫూర్తిగా నిలిచి, ఎంతో మందికి ఆరాధ్యదైవంగా నిలిచిన బ్రూస్లీ సినిమాలో ఆయన కుటుంబ సభ్యులే ప్రత్యక్షంగా పాలుపంచుకోనున్నారు. ఈ విషయాన్ని బ్రూస్ లీ కుమార్తె షానన్ లీ తెలిపారు. లారెన్స్ గ్రే, జేనెట్ యాంగ్ లతో పాటు తమ కుటుంబ సంస్థ బ్రూస్ లీ ఎంటర్ టైన్ మెంట్ ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం వహిస్తుందని ఆమె వెల్లడించారు. తన సినిమాల ద్వారా ఎంతో మందికి స్పూర్తిగా నిలిచిన బ్రూస్ లీ, ఇప్పుడీ సినిమా ద్వారా మరెంత మందికి స్పూర్తిగా నిలవనున్నారో చూడాలి.