: ప్రియాంక గాంధీ రంగప్రవేశానికి ముహూర్తం?


సోనియా గాంధీ తనయ ప్రియాంకా గాంధీ క్రియాశీల రాజకీయాల్లోకి రానున్నారా? ఇన్నాళ్లుగా రాజకీయాలపై పెద్దగా ఆసక్తి చూపని ప్రియాంక ఇక ఉపేక్షించాల్సిన పని లేదని భావిస్తున్నారా? తాజాగా వస్తున్న అంతర్గత వార్తలు చూస్తే ఆమె రానున్నారనే తెలుస్తోంది. ఆమెను కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించే అవకాశముందని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. సోదరుడు రాహుల్ గాంధీకి సాయం చేసేందుకే ప్రియాంక ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మూడు నెలలుగా రాహుల్ గాంధీ సోదరిని పార్టీలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆమెకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించాలన్నది ఆయన వ్యూహంగా తెలుస్తోంది. రాహుల్ ఆలోచనను పార్టీ సీనియర్ నేతలు స్వాగతించినట్టు తెలుస్తోంది. కాగా, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ రాగానే పార్టీ పునర్ వ్యవస్థీకరణపై దృష్టి సారించనున్నారని పార్టీ వర్గాల కథనం.

  • Loading...

More Telugu News