: హీరోగా నేనింకా ఎన్ని సినిమాలు చేస్తాను?: నాగార్జున


హీరోగా ఇంకెన్ని సినిమాలు చేస్తానని నటుడు నాగార్జున సందేహం వ్యక్తం చేశారు. టీవీకిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, మరో 5, లేక 10, లేక 15 సినిమాలు హీరోగా చేయగలనా? అని అన్నారు. విభిన్నమైన సినిమాలు చేయాలని ఆయన ఆకాంక్షించారు. తెలుగు ప్రేక్షకులు తనను ఇంకెంత కాలం హీరోగా చూస్తారని ఆయన సందేహం వ్యక్తం చేశారు. తాను చాలా రకాల సినిమాలు చేశానని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. అందరూ గుర్తుంచుకునే మంచి సినిమాలు తన ఖాతాలో చాలా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. తన కుమారుడు అఖిల్ ను తానే తెరకు పరిచయం చేశానని అన్నారు. అలాగే తన తండ్రి చివరి సినిమాను కూడా తానే పూర్తి చేశానని గుర్తు చేసుకున్నారు. స్వచ్ఛ భారత్ లో భాగంగా 8 గ్రామాలను అభిమానులు దత్తత తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు. తనను ఆదరించిన అభిమానులకు ధన్యవాదాలని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News