: సహాయం చేయాలని అనిపిస్తుంది...సాధ్యమైనంత చేస్తా: నాగార్జున
మీలో ఎవరు కోటీశ్వరుడు? కార్యక్రమంలో పాల్గొనే వారికి సహాయం చేయాలని అనిపిస్తుందని స్టార్ హీరో నాగార్జున తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి ఆ డబ్బు ఎంత అవసరమో తనకు తెలుస్తుందని, సహాయం చేయాలని ఉంటుందని, తనకు సాధ్యమైనంత సాయం చేసేందుకు ప్రయత్నిస్తానని అన్నారు. ఈ విషయంలో యూనిట్, నిర్వాహకులతో ఒకట్రెండు సార్లు హెచ్చరికలు కూడా అందుకున్నానని నాగార్జున తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా అవసరంలో ఉన్న చాలా మంది ఏదో రకంగా సహాయం అందుకోగలిగారని, మరికొందరు సెలబ్రిటీ హోదా సంపాదించుకున్నారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.