: వన్డేల్లో అతనిని మించిన వారు లేరంటే అతిశయోక్తి కాదు: తిరుమన్నే
వన్డేల్లో కుమార సంగక్కరను మించిన ఆటగాడు లేడని శ్రీలంక బ్యాట్స్ మన్ లాహిరు తిరిమన్నె (139 నాటౌట్) సీనియర్ ను ఆకాశానికెత్తాడు. ఇంగ్లండ్ తో మ్యాచ్ లో విజయం సాధించిన అనంతరం మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచ అత్యుత్తమ ఆటగాళ్లలో సంగక్కర ఒకడని అన్నాడు. వరుసగా రెండు మ్యాచుల్లో రెండు సెంచరీలు చేసి సత్తా చాటాడని పేర్కొన్నాడు. ఎంతో అనుభవం ఉన్న సంగక్కర జట్టును ప్రభావితం చేయగలడని తిరిమన్నె అభిప్రాయపడ్డాడు. సంగక్కర నంబర్ వన్ ఆటగాడని, అతని బ్యాటింగ్ చాలా బాగుంటుందని ప్రశంసించాడు. స్ట్రైక్ రొటేట్ చేయడమే కాకుండా బౌండరీలు బాదడంలోనూ సంగక్కర దిట్టని అన్నాడు.