: బీబీసీఐ అధ్యక్షుడు దాల్మియా?
బీసీసీఐ అధ్యక్షుడిగా మరోసారి బాధ్యతలు చేపట్టేందుకు జగ్మోహన్ దాల్మియాకు మార్గం సుగమమైనట్టు కనిపిస్తోంది. దశాబ్ద కాలం తర్వాత బీసీసీఐ అధ్యక్ష పదవి కోసం దాల్మియా రంగంలోకి దిగారు. శ్రీనివాసన్ వర్గం ఆయనకు మద్దతు తెలపడంతో ఆయన పోటీలో నిలిచినట్టు తెలుస్తోంది. అయితే ఆయన విజయం లాంఛనమేనని బీసీసీఐ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రేపు అనగా ఈ నెల 2న జరిగే బీసీసీఐ అధ్యక్ష ఎన్నికల్లో ఆయనను ఎన్నుకునేందుకు పూర్తి మద్దతు లభించినట్టు తెలుస్తోంది. తనను బీసీసీఐ అధ్యక్షుడిగా నియమించాలని మాజీ బీసీసీఐ అధ్యక్షుడు, మరాఠా యోధుడు శరద్ పవార్ ప్రధానిని కలిసిన విషయం తెలిసిందే. కాగా, తూర్పు జోన్ నుంచి ప్రవార్ ను ఎవరూ ప్రతిపాదించకపోవడంతో ఆయన పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు తెలుస్తోంది. దీంతో బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా దాల్మియా ఎన్నికకానున్నారని సమాచారం.