: తెలుగు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటం చేస్తా: పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటం చేస్తానని పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాలకు బడ్జెట్ కేటాయింపులు, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై ప్రధాని నరేంద్ర మోదీతో చర్చిస్తానని అన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏర్పడిన సమస్యలకు కేంద్రం పరిష్కారం చూపిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా, సార్వత్రిక ఎన్నికల ప్రచారం సందర్భంగా పవన్ కల్యాణ్ బీజేపీ, టీడీపీపై విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ రెండు పార్టీలకు మద్దతిస్తున్నానని, జనసేన పార్టీ కార్యకర్తలు ఓటేసి గెలిపించాలని ఆయన సూచించారు. ఈ నేపథ్యంలో రెండు పార్టీలు విజయం సాధించాయి. దీంతో సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని అన్నారు.