: 27000 రూపాయలున్న తులం బంగారం కేవలం 88.62 పైసలు మాత్రమే!
27 వేల రూపాయల ధర పలుకుతున్న బంగారం ధర కేవలం 88.62పైసలా, అదెక్కడ అనుకుంటున్నారా? మనదేశంలోనే! కాకపోతే స్వాతంత్ర్యం వచ్చేనాటికి బంగారం ధర అంతుంది. అప్పట్లో అణా, బేడ, పరక, పైసా, 2పైసలు ఇలా వాడుకలో ఉండేవి. 1947లో పది గ్రాముల బంగారం ధర కేవలం 88.62 పైసలు మాత్రమే. ఈ 67 సంవత్సరాలలో తులం బంగారం ధర 300 రెట్లు పెరిగి పలు హెచ్చు తగ్గుల నేపథ్యంలో 27,000 రూపాయలకు చేరింది. 2013 ఆగస్టులో తులం బంగారం ధర 35,574 రూపాయల వరకు వెళ్లింది. ఇదే ప్రస్తుతానికి బులియన్ మార్కెట్ లో నమోదైన గరిష్ఠ ధర.