: ఇద్దరు నాయుడుల నిజస్వరూపాలు బయటపడ్డాయి: వైసీపీ నేత అంబటి
వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మరోమారు మీడియా ముందుకు వచ్చారు. కేంద్ర బడ్జెట్ పై స్పందించేందుకు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుకుపడ్డారు. ఈ బడ్జెట్ తో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుల నిజస్వరూపాలు బయటపడ్డాయని ఆయన వ్యాఖ్యానించారు. బడ్జెట్ లో ఏపీకి చిల్లిగవ్వ విదల్చని కేంద్రంలో వెంకయ్యనాయుడు ఎలా కొనసాగుతారని కూడా ఆయన ప్రశ్నించారు. ఇక బీజేపీ సర్కారులో భాగస్వామిగా ఉన్న టీడీపీ సాధించిందేమిటని అంబటి, చంద్రబాబును నిలదీశారు.