: బీజేపీకి మేం మిత్రపక్షమో... విపక్షమో తెలియట్లేదు: ఏపీ డిప్యూటీ సీఎం కేఈ సంచలన వ్యాఖ్య
టీడీపీ సీనియర్ నేత, ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కొద్దిసేపటి క్రితం సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి తాము మిత్రపక్షమో, ప్రతిపక్షమో తెలియడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి బీజేపీ అన్యాయం చేసిందని ఆరోపించిన ఆయన రెండు పార్టీల మధ్య మైత్రిపై అనుమానం వ్యక్తం చేశారు. నేడు విజయవాడలో రిజిస్ట్రేషన్ శాఖాధికారులతో జరిపిన సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తీవ్ర ఆర్థిక లోటుతో ఇబ్బంది పడుతున్న ఏపీ సర్కారు ఆశ, నిరాశల మధ్య కొనసాగుతోందన్నారు. ఈ క్రమంలో ఆదుకోవాల్సిన కేంద్రం అన్యాయం చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.