: టెక్కలి హాస్టల్ లో విషాహారంతో విద్యార్థినులకు అస్వస్థత... మంత్రి అచ్చెన్నాయుడి పరామర్శ


శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని ప్రభుత్వ వసతి గృహంలో 53 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. హాస్టల్ లో భుజించిన విషాహారం కారణంగానే విద్యార్థినులు అనారోగ్యానికి గురయ్యారు. అస్వస్థతకు గురైన విద్యార్థినులను హాస్టల్ అధికారులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చేరిన విద్యార్థినుల్లో 43 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దీనిపై సమాచారం అందుకున్న ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్ విద్యార్థులను పరామర్శించారు. ఆరోగ్యం విషమంగా ఉన్న విద్యార్థినులను రిమ్స్ ఆస్పత్రికి తరలించాలని మంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News