: కాశ్మీర్ లో కొలువుదీరిన ముఫ్తీ సర్కారు... కేబినెట్ లో తొలిసారి బీజేపీకి చోటు


జమ్మూ కాశ్మీర్ 12వ ముఖ్యమంత్రిగా ముఫ్తీ మొహ్మద్ సయీద్ కొద్దిసేపటి క్రితం ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీతో కలిసి ఆయన సంకీర్ణ సర్కారును ఏర్పాటు చేశారు. బీజేపీతో కుదిరిన ఒప్పందం మేరకు ఆయన తన మంత్రివర్గంలో బీజేపీ ఎమ్మెల్యేలకు చోటు కల్పించారు. తద్వారా జమ్మూ కాశ్మీర్ లో బీజేపీ నేతలు తొలిసారిగా మంత్రి పదవులను దక్కించుకున్నారు. కొద్దిసేపటి క్రితం జరిగిన ప్రమాణ స్వీకారోత్సవానికి బీజేపీ తరఫున ప్రదాని నరేంద్ర మోదీ, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, పార్టీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ, సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి, కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తదితర అతిరథ మహారథులు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News