: ఇరకాటంలో వెంకయ్యనాయుడు... విలేకరుల ప్రశ్నలతో సతమతం!


తన వాగ్ధాటితో అనర్గళంగా మాట్లాడే సత్తా ఉన్న కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు నేటి ఉదయం హైదరాబాదులో జరిగిన మీడియా సమావేశంలో ఇబ్బంది పడ్డారు. కేంద్ర బడ్జెట్ లో తెలుగు రాష్ట్రాలకు జరిగిన అన్యాయంపై విలేకరులు వెంకయ్యపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు కేవలం రూ.100 కోట్ల నిధుల కేటాయింపులపై మీడియా ప్రతినిధులు ఒక్కసారిగా ప్రశ్నలు సంధించారు. దీంతో కాస్త ఇబ్బంది పడ్డ వెంకయ్య, తన పదునైన సమాధానాలతో ఎదురుదాడి చేసేందుకు యత్నించారు. అయితే ఏపీకి ప్రత్యేక హోదాపై వెంకయ్య సమాధానం చెప్పలేక సతమతమయ్యారు. అంతేకాక పోలవరం ప్రాజెక్టుకు కేటాయింపులపైనా మీడియా ప్రతినిధులు వెంకయ్యను తమ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. విలేకరుల మూకుమ్మడి ప్రశ్నలతో, తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరిగిన మాట వాస్తవమేనని వెంకయ్య ఒప్పుకోవాల్సి వచ్చింది.

  • Loading...

More Telugu News