: ఇద్దరు నాయుడులు కలిసి ఏపీకి తీరని అన్యాయం చేశారు: దేవినేని నెహ్రూ


ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడులిద్దరూ కలిసి ఆంధ్రప్రదేశ్ కు తీరని అన్యాయం చేశారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దేవినేని నెహ్రూ ఆరోపించారు. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించని వైనంపై ఏపీసీసీ ఆధ్వర్యంలో నేటి ఉదయం నుంచి నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. బెజవాడలో జరిగిన ఆందోళనకు నేతృత్వం వహించిన దేవినేని నెహ్రూ మాట్లాడుతూ... చంద్రబాబు, వెంకయ్యలు కలిసి ఏపీని నాశనం చేశారని దుయ్యబట్టారు. ఇప్పటికే పది సార్లు ఢిల్లీకి తిరిగానని చెప్పిన సీఎం చంద్రబాబు ఏం సాధించారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం కాళ్ల వద్ద కూర్చుంటే సమస్యలు పరిష్కారం కావని చంద్రబాబుకు సూచించారు. ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించి, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి డిమాండ్లు సాధించుకోవాలని సూచించారు.

  • Loading...

More Telugu News