: చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ... భూ సమీకరణపైనే ప్రధాన చర్చ
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొద్దిసేపటి క్రితం ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో భేటీ అయ్యారు. హైదరాబాదులో నేటి ఉదయం జరిగిన ఈ భేటీలో నవ్యాంధ్ర రాజధాని కోసం జరుగుతున్న భూ సమీకరణపై పవన్ కల్యాణ్, చంద్రబాబు వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. ప్రభుత్వం తమ నుంచి బలవంతంగా భూములను లాక్కుంటోందని జనసేన కార్యకర్తలు ఇటీవల ధర్నాకు దిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేటి పవన్, చంద్రబాబుల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. భూ సమీకరణతో పాటు కేంద్రం ప్రవేశపెట్టిన రైల్వే, సాధారణ బడ్జెట్లు, తాజా రాజకీయ పరిణామాలపైనా వారిద్దరూ చర్చించినట్లు తెలుస్తోంది.