: పార్వతీపురం ఆర్టీసీ డిపోలో బిగ్ ఫైట్... డ్రైవర్లు, సెక్యూరిటి సిబ్బంది మధ్య ఘర్షణ


విజయనగరం జిల్లా పార్వతీపురం ఆర్టీసీ డిపోలో నేటి ఉదయం ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. డిపోలో భద్రతను పర్యవేక్షిస్తున్న సెక్యూరిటీ సిబ్బంది, బస్సు డ్రైవర్ల మధ్య ఘర్షణ జరిగింది. ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. డ్రైవర్లు మద్యం తాగి విధులకు హాజరవుతున్నారని సెక్యూరిటీ సిబ్బంది ఆరోపించగా, అలాంటిదేమీ లేదని డ్రైవర్లు వాదించారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య వాదోపవాదాలు ముదిరి ఘర్షణ జరిగింది. అనంతరం సెక్యూరిటీ సిబ్బంది వైఖరికి నిరసనగా డ్రైవర్లు, కండక్టర్లతో కలిసి ధర్నాకు దిగారు. దీంతో బస్సులన్నీ డిపోలోనే నిలిచిపోయాయి. ముందస్తు సమాచారం లేకుండా ఆర్టీసీ సిబ్బంది ఆందోళనకు దిగడంతో బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

  • Loading...

More Telugu News