: బ్రాడ్ బ్యాండ్ లో ఏపీ టాప్... దేశానికే ఆదర్శనమన్న కేంద్రం!
రాష్ట్ర విభజన అనంతరం తీవ్ర ఆర్థిక లోటులో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్, ఓ విషయంలో మాత్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందట. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటు సాక్షిగా నిన్నటి బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్ ను వినియోగించే తొలి రాష్ట్రంగా ఏపీ గుర్తింపు పొందిందని జైట్లీ ప్రకటించారు. ఈ నెట్ వర్క్ ను ఏర్పాటు చేసుకుంటానంటూ ఏపీనే తనకు తానుగా ముందుకొచ్చిందని ఆయన కితాబిచ్చారు. ఇందుకోసమయ్యే ఖర్చును ఏపీనే భరించినా, ఆ తర్వాత టెలికాం శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని 1.2 కోట్ల కుటుంబాలకు 10-15 ఎంబీపీఎస్ స్పీడుతో బ్రాడ్ బ్యాండ్ ను అందించే లక్ష్యంతో ఏపీ ముందుకుసాగుతోందని జైట్లీ అన్నారు.