: సమాచారమివ్వకుండా ఎలా వెళతారు?... రాహుల్ ఆచూకీ తెలపాలని కోర్టులో పిల్


ఓ జాతీయ పార్టీకి ఉపాధ్యక్షుడిగానే కాక లోక్ సభ సభ్యుడిగా ఉన్న రాహుల్ గాంధీ చెప్పా పెట్టకుండా ఎలా మాయమవుతారని లక్నో న్యాయవాది అశోక్ పాండే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎస్పీజీ భద్రత పొందుతున్న రాహుల్ గాంధీ, పర్యటన వివరాలు వెల్లడించకుండా వెళ్లడం కుదరదని కూడా ఆయన వాదిస్తున్నారు. ఈ మేరకు రాహుల్ గాంధీ ఆచూకీ తెలపాలని ఆయన అలహాబాదు హైకోర్టులో నిన్న ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. రాహుల్ గాంధీ ఆచూకీని తెలుసుకోవాల్సిందిగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖతో పాటు ఎస్పీజీ డీజీకి ఆదేశాలు జారీ చేయాలని పాండే తన పిటిషన్ లో కోర్టును కోరారు.

  • Loading...

More Telugu News