: జమ్మూ, కాశ్మీర్ సీఎంగా ముఫ్తీ ప్రమాణం నేడు... హాజరుకానున్న ప్రధాని మోదీ


పీడీపీ నేత ముఫ్తీ మొహ్మద్ సయీద్ నేడు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటీవల జరిగిన ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీకి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజార్టీ రాలేదు. దీంతో పలు పార్టీల మధ్య సుదీర్ఘంగా జరిగిన సంప్రదింపులు ఫలితాన్నివ్వకపోవడంతో ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించక తప్పలేదు. చివరికి బీజేపీ, పీడీపీల మధ్య జరిగిన చర్చలు ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చాయి. ఈ నేపథ్యంలో పీడీపీ నేత ముఫ్తీ మొహ్మద్ సయీద్ సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు ఇరు పార్టీలు ఓ అవగాహనకు వచ్చాయి. దీంతో నేడు ముఫ్తీ జమ్మూ కాశ్మీర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ సహా బీజేపీకి చెందిన కీలక నేతలు హాజరుకానున్నారు.

  • Loading...

More Telugu News