: బడ్జెట్లా లేదు... విజన్ డాక్యుమెంట్లా ఉంది: కల్వకుంట్ల కవిత
కేంద్ర బడ్జెట్ పై నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత స్పందించారు. బడ్జెట్ లో రైతులకు ఉపకరించే ప్రతిపాదనలేవీ లేవని మండిపడ్డారు. ప్రధాని ప్రచారం కోసం రైతులను వాడుకుంటున్నారని ఆరోపించారు. ఇది బడ్జెట్ లా లేదని, ఓ విజన్ డాక్యుమెంట్ లా కనిపిస్తోందని అన్నారు. దీనిపై ఆమె మాట్లాడుతూ, మొత్తమ్మీద నిరాశాజనకమైన బడ్జెట్ అని పేర్కొన్నారు. ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకుంటే, అన్ని విధాలా నిరాశపరిచారని దుయ్యబట్టారు. మేక్ ఇన్ ఇండియా, నీతి ఆయోగ్... అంటూ ఫ్యాన్సీ పేర్లకే పరిమితమయ్యారని కవిత ఎద్దేవా చేశారు.