: ప్లాన్ ప్రకారం ఫినిష్ చేశాం: ధోనీ


యూఏఈ జట్టుపై ఘనవిజయం అనంతరం కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మాట్లాడుతూ, ప్రణాళికాబద్ధంగా ఆడి ఫలితం రాబట్టామని అన్నాడు. ప్రత్యర్థి బ్యాట్స్ మెన్ ను స్వేచ్ఛగా ఆడనివ్వరాదని నిర్ణయించుకున్నామని తెలిపాడు. బౌలర్లు బాగా రాణించారని ప్రశంసించాడు. కలసికట్టుగా ఆడే క్రీడలో ఓ విభాగం రాణిస్తే దాని ప్రభావం మిగతా విభాగాల్లోనూ ప్రతిఫలిస్తుందని అభిప్రాయపడ్డాడు. ఓ డ్రాప్ క్యాచ్ మినహా ఫీల్డింగ్ అద్భుతమని పేర్కొన్నాడు. కొత్త బంతితో పేసర్లు రాణిస్తున్నారని, మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లు బ్యాట్స్ మెన్ పనిబడుతున్నారని కితాబిచ్చాడు. ఈ ఒరవడిని కొనసాగించాల్సి ఉందని అన్నాడు. గాయం నుంచి కోలుకుని జట్టులోకొచ్చిన భువీ తొలి ఐదు ఓవర్లు పదునైన బౌలింగ్ తో ఆకట్టుకున్నాడని, జరగబోయే మ్యాచ్ లలో చివరి ఓవర్లలో కూడా ఎలా బౌలింగ్ చేస్తాడో పరిశీలిస్తామని ధోనీ తెలిపాడు.

  • Loading...

More Telugu News