: చంద్రబాబు 'ఊ' అంటే చాలు... కేంద్రంపై పోరాటమే: ఎంపీ శివప్రసాద్


కేంద్ర బడ్జెట్ పై టీడీపీ ఎంపీలు మండిపడుతున్నారు. బడ్జెట్ లో ఏపీకి న్యాయం జరుగుతుందని ఆశించి భంగపడ్డామని ఆ పార్టీ ఎంపీ శివప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. విరాట పర్వంలో పాండవుల పరిస్థితిలా తమ పరిస్థితి తయారైందని అన్నారు. తమ అస్త్ర, శస్త్రాలన్నీ జమ్మిచెట్టుపై ఉన్నాయని... వాటిని ఎప్పుడు తీయాలో అర్థం కావడం లేదని చెప్పారు. తమ అధినేత చంద్రబాబు ఊ అంటే చాలు... కేంద్రంపై పోరాడుతామని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News