: బ్లాక్ మనీపై మోదీ ప్రభుత్వం చేతులెత్తేసింది... బడ్జెట్ లో ఏమీ లేదు: ఎంపీ రాపోలు
విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని వెనక్కి రప్పిస్తామంటూ బీరాలు పలికిన బీజేపీ ఇప్పుడు దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తోందని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ ఆరోపించారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రసంగం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బ్లాక్ మనీని తీసుకువస్తామన్న బీజేపీ... ఇప్పుడు కొత్త చట్టాలను తెస్తామంటోందని ఎద్దేవా చేశారు. బడ్జెట్ లో ఏమీ లేదని... అంతా అంకెల గారడీనే అని అన్నారు. ప్రజలను మభ్యపెట్టడానికి ఆర్థిక మంత్రి ప్రయత్నం చేశారని మండిపడ్డారు.