: పన్ను చెల్లింపుదారుల వద్ద ఎక్కువ డబ్బులు ఉండాలని ఆశిస్తున్నాం: జైట్లీ
ఈ రోజు పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పన్ను చెల్లింపుదారుల వద్ద ఎక్కువ డబ్బులు ఉండాలని ఆశిస్తున్నామని తెలిపారు. సంస్కరణల వెనకున్న ఉద్దేశం అదేనని స్పష్టం చేశారు. పొదుపును ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. 14వ ఆర్థిక సంఘం సిఫారసులు అభినందనీయమన్నారు. గత బడ్జెట్ లో చెప్పినట్టు ఒకే హోదా-ఒకే పింఛను అమలు చేస్తామని పేర్కొన్నారు. ప్రపంచం ఇప్పుడు మనవైపు ఆసక్తిగా చూస్తోందని జైట్లీ అన్నారు. దేశాభివృద్ధిలో రాష్ట్రాలది కీలకపాత్ర అని పేర్కొన్నారు.