: మోదీపై పొగడ్తలతో మొదలైన బడ్జెట్ ప్రసంగం


ప్రధాని మోదీపై పొగడ్తల వర్షం కురిపిస్తూ ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తన బడ్జెట్ ప్రసంగాన్ని మొదలుపెట్టారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉందని, సవాళ్ళను అధిగమించే సత్తా భారత్ కు ఉందని ఆయన అన్నారు. ఆర్థిక వృద్ధి బాటలో రాష్ట్రాలు ఏంతో కీలక భాగస్వాములని, ప్రజలు వెచ్చించే ప్రతి పైసా సక్రమంగా ఖర్చుపెడతామని వివరించారు. ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోందని అన్నారు. గత 8 నెలల్లో మోదీ తీసుకున్న నిర్ణయాలు దేశాన్ని ముందడుగు వేయించాయని తెలిపారు. జైట్లీ ప్రసంగం కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News