: నేటితో ముగుస్తున్న ఏపీ రాజధాని భూసేకరణ
నవ్యాంధ్ర రాజధాని భూసమీకరణ ఈరోజుతో ముగియనుంది. చివరిరోజు కావడంతో భూమి ఇస్తున్న రైతుల నుంచి సమ్మతి పత్రాలను స్వీకరించనున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. భూసమీకరణ కార్యాలయాల వద్ద వందమంది అదనపు సిబ్బందిని కూడా నియమించారు. నేటి రాత్రి వరకూ కూడా రైతుల నుంచి సమ్మతి పత్రాలు తీసుకునేలా చర్యలు చేపడుతున్నారు. అంతేగాక ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా గ్రామాల్లో పోలీసులు మోహరించారు. మంగళగిరి, నిడమర్రు, బేతపూడిలో లే అవుట్లను పురపాలకశాఖ మంత్రి నారాయణ పరిశీలించారు. రాజధాని భూసమీకరణ గ్రామాల్లో ఉదయం నుంచే అధికారులు పర్యటిస్తున్నారు. ఇప్పటివరకు 25,000 ఎకరాలను రాజధాని కోసం సేకరించిన సంగతి తెలిసిందే.