: ఘోరంగా విఫలమైన ఆస్ట్రేలియా... న్యూజిలాండ్ విజయ లక్ష్యం 152 పరుగులు


ప్రపంచకప్ లో భాగంగా, న్యూజిలాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఘోరంగా విఫలం అయింది. హేమాహేమీలుగా పేరున్న ఆటగాళ్లంతా వరుసగా పెవిలియన్ దారి పట్టడంతో, కేవలం 151 పరుగులకే ఆలౌట్ అయింది. ఒక్క ఆటగాడు కూడా రాణించలేదు. హడిన్ చేసిన 43 పరుగులే అత్యధికం. ఆస్ట్రేలియా స్కోర్ లో ఫించ్ 14, వార్నర్ 34, వాట్సన్ 23, క్లార్క్ 12, స్మిత్ 4, మాక్స్ వెల్ 1, మార్ష్ 0, జాన్సన్ 1, స్టార్క్ 0, కమిన్స్ 7 పరుగులకు అవుట్ అయ్యారు. 106 పరుగుల వద్ద ఆస్ట్రేలియా 9వ వికెట్ కోల్పోగా అక్కడినుంచి న్యూజిలాండ్ సహనానికి కొంత పరీక్ష ఎదురైంది. బ్రాడ్ హడిన్, కమిన్స్ పరీక్ష పెట్టారు. జాగ్రత్తగా ఆడుతూ స్కోర్ ను 150 పరుగులు దాటించారు. మరికాసేపట్లో 152 పరుగుల సునాయాస విజయ లక్ష్యంతో న్యూజిలాండ్ బరిలోకి దిగనుంది.

  • Loading...

More Telugu News