: అమెరికాలో ఉన్మాది కాల్పులు... 9 మంది మృతి


ఉన్మాదిగా మారిన ఓ వ్యక్తి వివిధ ప్రాంతాల్లో 9 మందిని కాల్చి చంపి తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన అమెరికాలోని మిస్సోరి రాష్ట్రంలో కలకలం సృష్టించింది. కాల్పులు జరిపిన అనుమానితుడి మృతదేహాన్ని గుర్తించామని పోలీసులు తెలిపారు. టైరోన్ పట్టణంలోని నాలుగు ప్రాంతాల్లో దాడి జరిగిందని, షనోన్ కౌంటీలో రెండు ఘటనలు జరిగాయని టెక్సాస్ కౌంటీ షరీఫ్ జేమ్స్ సిగ్మన్ వివరించారు. రోడ్డు పక్కన పార్కింగ్ చేసిన వాహనంలో నిందితుడి మృతదేహాన్ని, నాలుగు ఇళ్లలో బాధితుల మృతదేహాలను కనుగొన్నట్టు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News