: కార్యకర్తలను ఇబ్బంది పెడితే బట్టలూడదీస్తా... పోలీసులకు మాజీ డిప్యూటీ సీఎం వార్నింగ్
టీఆర్ఎస్ ఆదేశాలతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పోలీసులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మండిపడ్డారు. ఇలాగే కొనసాగితే, చూస్తూ ఊరుకునేది లేదని, బట్టలూడదీస్తానని ఆయన హెచ్చరించారు. మెదక్ జిల్లా మునిపల్లి మండలం ఖమ్మంపల్లిలో ఓ కాంగ్రెస్ కార్యకర్త కూతురి వివాహానికి ఆయన అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు ఆయనతో తమ గోడు వెళ్లబెట్టుకుంటూ, పోలీసులు తమపై కేసులు పెట్టి మానసిక క్షోభకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.