: కావాలంటే చెప్పండి... మత పునఃమార్పిడి చేసేస్తాం: గోవా వాసులకు వీహెచ్ పీ ఆఫర్
విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్ పీ) గోవా వాసులకు ఆఫర్ ఇస్తోంది. ప్రజలు ఎవరైనా మత పునఃమార్పిడి కోరుకుంటే, వారిని మార్చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని గోవా, మహారాష్ట్ర రాష్ట్రాల వీహెచ్ పీ కన్వీనర్ దాదా వేదక్ తెలిపారు. వేల సంవత్సరాల క్రితం గోవాలోని హిందువులు క్రైస్తవంలోకి వెళ్లారని పేర్కొన్నారు. ఎవరైనా తిరిగి హిందూ మతంలోకి రావాలని భావించి తమను సంప్రదిస్తే అందుకు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. కాథలిక్ చర్చి బలవంతంగా హిందువులను క్రైస్తవులుగా మార్చేసిందని ఆయన ఆరోపించారు. కానీ, వీహెచ్ పీ మాత్రం బలవంతంగా మార్పిళ్లు చేయబోదని, 'మమత', 'సమత', 'ప్రేమ'తో పునఃమార్పిడి చేస్తామని వివరించారు. వారు తిరిగి హిందూ మతంలోకి వస్తామంటే ఎలా ఆపగలమని అన్నారు.