: ఆంధ్రప్రదేశ్ లో ఆ నాలుగు జిల్లాలకు కేంద్రం సాయం
ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాలకు కేంద్రం నుంచి సాయం అందనుంది. తీవ్రవాద ప్రాబల్యం గల జిల్లాలకు సాయం కొనసాగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో, నక్సల్ ప్రాబల్యం (మావోయిస్టుల ముప్పు) అధికంగా ఉన్న విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాలకు ఈ సాయం అందనుంది. సరిహద్దుల రక్షణ, గిరిజనుల పునరావాసం వంటి అంశాల్లో కేంద్రం నిధులు అందజేయనున్నట్టు సమాచారం.