: తమిళనాడు ఎక్స్ ప్రెస్ లో భార్యాభర్తలను బెదిరించి దోపిడీ
ఇటీవల రైళ్లలో దోపిడీ ఘటనలు తరచుగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా, ఆగ్రా సమీపంలోని ఫరా స్టేషన్ కు కొద్ది దూరంలో... తమిళనాడు ఎక్స్ ప్రెస్ లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఏసీ కోచ్ లో ప్రయాణిస్తున్న రామ్ కుమార్ దంపతులపై నలుగురు దొంగలు దాడి చేశారు. దీంతో, భయపడిపోయిన వారు తమ వద్ద ఉన్న బంగారం, పెద్ద మొత్తంలో నగదు దొంగలకు ఇచ్చేశారు. కాగా, దోపిడీ జరిగిన సమయం అర్థరాత్రి కావడంతో, కంపార్ట్ మెంట్ లో ఎక్కువమంది ప్రయాణికులు గాఢనిద్రలో ఉన్నారు. కాగా, దొంగల దాడిలో రామ్ కుమార్ దంపతులకు గాయాలయ్యాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.