: పసికూనను కసిగా కుమ్మేస్తారా?... రేపు యూఏఈతో టీమిండియా పోరు
వరల్డ్ కప్ లో టీమిండియా మూడో మ్యాచ్ కు సిద్ధమైంది. రేపు పెర్త్ లో యూఏఈ జట్టుతో ఆడనుంది. ఇప్పటికే పాకిస్థాన్, దక్షిణాఫ్రికా జట్లను మట్టికరిపించిన ధోనీ సేన పసికూన వంటి ఎమిరేట్స్ జట్టును చిత్తు చేసి గ్రూప్ లో స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని భావిస్తోంది. బ్యాటింగ్ లైనప్ లో రోహిత్ తప్ప అందరూ ఫామ్ లో ఉన్నారు. ఈ ముంబైవాలా సామర్థ్యంపై ఎవరికీ అనుమానాల్లేవు. టచ్ లోకి వచ్చాడంటే యూఏఈ కూనలకు చుక్కలు కనిపించడం ఖాయం. ధావన్, కోహ్లీ, రహానే... ఇలా ప్రధాన బ్యాట్స్ మెన్ ఫామ్ లో ఉండడంతో ఇప్పటివరకు అంతా సవ్యంగానే సాగింది. శనివారం జరిగే మ్యాచ్ లో పెద్దగా పేరులేని యూఏఈ బౌలర్లు టీమిండియా లైనప్ ను ఇబ్బంది పెట్టడం కష్టమే. బౌలర్లు కూడా సమయోచితంగా రాణించడం భారత్ కు ప్లస్ పాయింట్. ప్రస్తుతం ధోనీ సేన జోరు చూస్తే ఖాతాలో మరో విజయం చేరినట్టుగానే భావించుకోవచ్చని క్రికెట్ పండితులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.