: యాదగిరిగుట్ట అభివృద్ధి సంస్థ అధ్యక్షుడిగా కేసీఆర్


యాదగిరిగుట్టను తిరుమల స్థాయిలో అభివృద్ధి పరచాలనే లక్ష్యంతో ఉన్న టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ దిశగా పనులను వేగవంతం చేశారు. గుట్ట అభివృద్ధి కోసం ఏటా రూ. 100 కోట్లు ఖర్చు చేస్తామని ఇప్పటికే ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి కొనసాగింపుగా, యాదగిరిగుట్ట అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ సంస్థకు స్వయంగా కేసీఆరే అధ్యక్షుడిగా ఉండబోతున్నారు. మరోవైపు, యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాల సందర్భంగా, ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలను కేసీఆర్ సమర్పించారు. ఈ కార్యక్రమానికి ఆయన సతీసమేతంగా హాజరయ్యారు.

  • Loading...

More Telugu News