: తేలిపోయిన వెస్టిండీస్... దక్షిణాఫ్రికాకు చిరస్మరణీయ విజయం
కళ్లెదుట భారీ స్కోర్ కనిపిస్తుంటే, 'మా గేల్ కొట్టేస్తాడు' అని అద్భుతాన్ని ఆశించిన వెస్టిండీస్ అభిమానులకు తీవ్ర నిరాశ తప్పలేదు. 409 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన కరీబియన్ జట్టులో ఒకరి తరువాత ఒకరు వరుసగా వెనుదిరగగా, కేవలం 33.1 ఓవర్లలో 151 పరుగులకు ఆలౌట్ అయ్యారు. దీంతో భారత్ పై ఓడిపోయి నిరాశ మీదున్న దక్షిణాఫ్రికా జట్టు చిరస్మరణీయ విజయం సాధించి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంది. 257 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన ఆ జట్టు వరల్డ్ కప్ క్రికెట్ పోటీలలో అత్యధిక మార్జిన్ విజయాన్ని సమం చేసింది. అంతకుముందు బ్యాటింగ్ ప్రారంభించిన విండీస్ జట్టులో గేల్ 3 పరుగులు చేసి వెనుదిరగ్గా, స్మిత్(31) పరుగులకు అవుట్ అయ్యాడు. శామ్యూల్స్ (0), సిమ్మన్స్ (0) డకౌటయ్యారు. రాందిన్ 22, హోల్డర్ 56, టేలర్ 15, బెన్ 1 పరుగుతో సరిపెట్టుకున్నారు. సఫారీ బౌలర్లలో అబ్బాట్ 6 వికెట్లు, మార్కెల్ 3, తాహిర్ 2 వికెట్లు తీశారు.