: స్పీక్ ఏషియా కుంభకోణంలో రూ. 700 కోట్ల గోల్ మాల్... త్వరలో విచారణ
ఆన్ లైన్ సంస్థగా ప్రారంభమై రూ.700 కోట్ల రూపాయల మేరకు ప్రజలను మోసం చేసిన స్పీక్ ఏషియా కుంభకోణంలో త్వరలో కోర్టు విచారణ మొదలవుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. లోక్ సభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసు (భారీ మోసాలకు పాల్పడే వారిని విచారించే కార్యాలయం-ఎస్ఎఫ్ఐఓ) దర్యాప్తును ఇప్పటికే పూర్తి చేసిందని జైట్లీ వివరించారు. సింగపూర్ కేంద్రంగా స్పీక్ ఏషియా ఇండియాలో కార్యకలాపాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అధిక వడ్డీలు ఇస్తామని ఆశ చూపి ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో పేదల నుంచి వేల కోట్ల రూపాయలను సంస్థ దోచుకున్న ఘటన 2011లో వెలుగులోకి వచ్చింది.