: అనుకున్నది సాధించే దాకా వదిలిపెట్టను: ఏపీ సీఎం చంద్రబాబునాయుడు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కొద్దిసేపటి క్రితం కీలక వ్యాఖ్యలు చేశారు. అనుకున్నది సాధించేదాకా వదిలిపెట్టనని ఆయన ప్రకటించారు. రాయలసీమ పర్యటనకు వెళ్లిన ఆయన కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సామాజిక సాధికారతా మిషన్ ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ నుంచి పేదలకు ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున బియ్యాన్ని పంపిణీ చేస్తామన్నారు. వృద్ధులకు ఇళ్ల వద్దనే పింఛన్ సొమ్మును అందజేస్తామన్నారు. కర్నూలును మెరుగైన నగరంగా తీర్చిదిద్దనున్నామన్నారు. ఓర్వకల్లు సమీపంలో గ్రీన్ ఫీల్డ్ తరహా టౌన్ షిప్ ను ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు. అనుకున్నది సాధించేదాకా వదిలిపెట్టనని ప్రకటించిన ఆయన, కర్నూలుకు కేంద్రం ప్రకటించిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని సాధించి తీరతామని పేర్కొన్నారు.