: వలస రాలేదు, పార్టీలు మారలేదు... మంత్రి గంటాపై మరో మంత్రి అయ్యన్న పాత్రుడి పరోక్ష విమర్శలు
ఆంధ్రప్రదేశ్ మంత్రుల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావుపై మరో మంత్రి అయ్యన్న పాత్రుడు పరోక్షంగా తీవ్ర విమర్శలు చేశారు. తాను వ్యాపారవేత్తను కానని, పార్టీలు మారే తత్వం తనకు లేదని గంటా పేరు చెప్పకుండా అయ్యన్న వ్యాఖ్యానించారు. ఈ ఉదయం మాడుగులలో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. తాను ఎన్టీఆర్ యూనివర్సిటీ నుంచి వచ్చిన క్రమశిక్షణ గల నేతనని తెలిపారు. తాను స్థానికుడినని, ఇతర నేతల మాదిరిగా ఎక్కడినుంచో వలస రాలేదని వివరించారు. అయ్యన్న వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీలో దుమారం రేపుతున్నాయి.