: ఐఎస్ఐఎస్ పై యుద్ధానికి దిగిన పెద్దన్న... విమానాలతో భీకర దాడులు


ప్రపంచానికి పెను ప్రమాదంగా పరిణమించిన ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్)పై అమెరికా ప్రత్యక్ష యుద్ధానికి దిగింది. ఐఎస్ఐఎస్ స్థావరాలపై అమెరికా యుద్ధ విమానాలతో భీకర దాడులు చేస్తోంది. 220 మంది అస్సిరియన్ క్రైస్తవులను ఐఎస్ ఉగ్రవాదులు బందీలుగా పట్టుకెళ్లిన వెంటనే, అమెరికా బాంబర్లు దాడులు ప్రారంభించాయి. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండానే, హసాకే ప్రావిన్స్ లోని తాల్ తమర్ ప్రాంతాలపై అమెరికా దాడులు ప్రారంభించినట్లు సిరియన్ హక్కుల సంస్థ తెలిపింది. కాగా, ఈ దాడుల్లో జరిగిన ప్రాణ నష్టం గురించి ఇంకా సమాచారం వెలువడలేదు. తాల్ తమర్ సమీపంలోని పది గ్రామాల్లోకి చొరబడ్డ ఐఎస్ ఉగ్రవాదులు చిన్నారులు, మహిళలు, యువకులు సహా 220 మందిని బందీలుగా పట్టుకోవడం, వీరంతా క్రిస్టియన్లు కావడంతో అమెరికా స్పందించినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News