: చంచల్ గూడ జైలుకు ఏపీ రాం రాం!


ఇకపై ఏపీకి చెందిన ఏ ఒక్కరు అరెస్టైనా చంచల్ గూడ జైలుకు రారు. ఎందుకంటే, తాను అరెస్ట్ చేసిన నిందితులను ఇకపై చంచల్ గూడ్ జైలుకు తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ సర్కారు సుముఖంగా లేదు. తాను అరెస్ట్ చేసిన నిందితులు, తన రాష్ట్రానికి చెందిన ఖైదీలను తన సొంత జైళ్లలోనే ఉంచాలని చంద్రబాబునాయుడి సర్కారు తీర్మానించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎక్కడి ఖైదీలను అక్కడే ఉంచాలన్న నిర్ణయం మేరకే ఏపీ సర్కారు ఈ దిశగా చర్యలు చేపట్టింది.

  • Loading...

More Telugu News