: మోదీ, సోనియా, ప్రణబ్, అద్వాని, మన్మోహన్... రైల్వే బడ్జెట్ తరువాత అంతా అక్కడికే!
రాజకీయ బంధుగణం అంతా ఒకే చోటకు చేరారు. అధికార పక్షం, విపక్షం అనేది లేకుండా అందరూ నిన్న రైల్వే బడ్జెట్ ప్రసంగం తరువాత అక్కడికే చేరారు. దేశంలో ఇద్దరు ప్రముఖ నేతలు ములాయం, లాలూ ప్రసాద్ యాదవ్ ల ఇంట జరిగిన వివాహ వేడుక నేతలతో కిక్కిరిసి పోయింది. లాలూ కుమార్తె, ములాయం మనవడు ఈ వేదికపై ఒకటయ్యారు. వివాహానికి ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, సీనియర్ నేత అద్వానీ, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ లతో పాటు పలువురు ఎంపీలు, బాలీవుడ్ తారలు, సుమారు లక్ష మందికి పైగా ఆహ్వానితులు ఈ వేడుకకు వచ్చారు.