: 'వసూల్ మామ'ల ఆటకట్టు... 130 మంది పోలీసుల బదిలీ!


హైదరాబాదు పరిధిలో లంచాలు మెక్కేందుకు అలవాటు పడ్డ 130 మంది 'పోలీసు మామ'లపై వేటు పడింది. వివిధ స్టేషన్ల పరిధిలో నెలవారీ మాముళ్లు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై నివేదికలు తెప్పించుకున్న ఉన్నతాధికారులు, వీరిని సిటీ ఆర్మ్‌డ్ రిజర్వుకు అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. పోలీసుల్లో అవినీతి వ్యవహారాలపై మీడియాలో వచ్చిన వరుస కథనాలపై స్పందించిన కమిషనర్ మహేందర్ రెడ్డి ఎంత మంది 'వసూల్ రాజా'లు ఉన్నారనే విషయంపై రహస్య విచారణ చేయించి నివేదిక తెప్పించుకున్నారు. దీని ఆధారంగా వీరిని విధుల నుంచి తప్పించారు. ఏ ఒక్కరి నుంచైనా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తే సంబంధిత కానిస్టేబుల్, హోంగార్డులతో పాటు స్టేషన్ ఎస్‌హెచ్‌వోపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరికలు జారీ చేసినట్టు తెలిసింది.

  • Loading...

More Telugu News