: రైల్వే బడ్జెట్టులో తెలంగాణకు న్యాయం... సీఎం చొరవే కారణమన్న కల్వకుంట్ల కవిత
ఉమ్మడి రాష్ట్రంలో ఏళ్ల తరబడి నిధుల కేటాయింపులో అన్యాయానికి గురైన తెలంగాణకు, ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత తొలిసారిగా న్యాయం జరిగిందని నిజామాబాదు ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. రైల్వే బడ్జెట్టుపై స్పందించిన ఆమె, ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత వచ్చిన తొలి రైల్వే బడ్జెట్టులోనే తెలంగాణకు న్యాయమైన కేటాయింపులు దక్కాయని ఆమె అభిప్రాయపడ్డారు. పెద్దపల్లి-నిజామాబాదు రూటుకు భారీగా నిధులు విడుదలయ్యాయని ఆమె పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ తో పాటు టీఆర్ఎస్ ఎంపీల కృషి కారణంగానే ఈ కేటాయింపులు దక్కాయని ఆమె వెల్లడించారు. కొత్త లైన్లకు ఆమోదం తెలిపి ఉంటే మరింత బాగుండేదని కవిత అన్నారు.