: భర్తకు భోజనం వడ్డిస్తున్న మహిళ తల నరికారు!


మధ్యాహ్న వేళ భర్తకు భోజనం వడ్డిస్తున్న మీరా దేవి అనే మహిళను కిరాతకంగా హతమార్చారు కొందరు వ్యక్తులు. ఆమె తల నరికి చంపారు. కత్తులు, తుపాకులతో ఇంట్లో ప్రవేశించి దాడికి దిగారు. ఈ ఘటన బీహార్లోని దౌలత్ పూర్ గ్రామంలో జరిగింది. మహిళను హత్య చేసిన తర్వాత, ఆమె భర్త మహేంద్రపాల్ పైనా, ఇతర కుటుంబ సభ్యులపైనా విచక్షణ రహితంగా దాడికి దిగారు. దాడికి పాల్పడింది బంధువులేనని సమాచారం. అనంతరం వారు పరారయ్యారు. కాగా, ఈ హత్యకు గల కారణాలు వెల్లడికాలేదు.

  • Loading...

More Telugu News