: "3-4-5-11" రైల్వేల కోసం సురేష్ కొత్త మంత్రం!


నేడు పార్లమెంట్ ముందుకు రైల్వే మంత్రి సురేష్ ప్రభు రైల్వేల భవిష్యత్ అభివృద్ధి కోసం "3-4-5-11" మంత్రం పఠించారు. ఆయన మొత్తం బడ్జెట్ ప్రసంగాన్ని "3 సూత్రాలు, 4 లక్ష్యాలు, 5 చోదక శక్తులు, 11 ప్రాధాన్యతా అంశాలు"గా చెప్పొచ్చు. ఆధునికీకరణ, భద్రత, పారదర్శకత పెంచుతామని చెప్పిన ఆయన 4 భవిష్యత్ లక్ష్యాలను తెలిపారు. అవి 1. ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు, 2. ప్రయాణంలో మరింత భద్రత, 3. సామర్థ్యం పెంపు మరియు మౌలిక వసతుల కల్పన, 4. నిరుపయోగంగా ఉన్న రైల్వేల ఆస్తుల ద్వారా నిధులు సమకూర్చుకొని విస్తరణ. ఈ లక్ష్యాలను అందుకునేందుకు 5 చోదక శక్తులను గుర్తించినట్టు ఆయన వివరించారు. అవి 1. ఐదేళ్ల యాక్షన్ ప్లాన్ అమలు, 2. ప్రభుత్వ, ప్రైవేటు రంగ భాగస్వామ్యాలు, 3. వచ్చే ఐదేళ్లలో రూ.8.5 లక్షల నిధుల సమీకరణ, 4. నిర్వహణా లోపాల మెరుగు, 5. పారదర్శకత, పరిపాలనలో నాణ్యతా ప్రమాణాలు. వీటిని అమలు చేస్తే లక్ష్యాలను సులువుగా అందుకోవచ్చని సురేష్ వివరించారు. రైల్వేల్లో మరో 11 విభాగాలను ప్రస్తావించిన ఆయన మౌలిక వసతులు, రక్షణ, ప్రయాణికులకు సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News